బల్దియాపై గులాబీ జెండా ఎగరడం ఖాయం
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఇన్‌చార్జి వీజీ గౌడ్‌తో కలిసి బుధవారం పట్టణంలోని 16, 17 వార్డులలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసగించిందని విమర్శించారు. మరో సారి ఓటు వేస్తే హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. పార్టీ అభ్యర్థులు గుంజ జ్యోతి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధి బల్వంత్ రావు, నాయకులు గుంజ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిక
కామారెడ్డి క్రైం: బీజేపీ పట్టణ కార్యదర్శి రాజావరపు గురుమూర్తి బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, నాయకులు పాల్గొన్నారు.


