రేణుకాదేవి ఎల్లమ్మ కల్యాణోత్సవం | - | Sakshi
Sakshi News home page

రేణుకాదేవి ఎల్లమ్మ కల్యాణోత్సవం

Feb 4 2026 7:07 AM | Updated on Feb 4 2026 7:07 AM

రేణుక

రేణుకాదేవి ఎల్లమ్మ కల్యాణోత్సవం

రేణుకాదేవి ఎల్లమ్మ కల్యాణోత్సవం ముత్యంపేటలో.. నేటి నుంచి ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలు ముగిసిన ఊర పండుగ

భిక్కనూరు: మండల కేంద్రంలోని రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం 50వ వార్షికోత్సవాలను గౌడ సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం గౌడ సంఘం ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

దోమకొండ: ముత్యంపేట గ్రామ ఎల్లమ్మ ఆలయంలో ఆలయ వార్షికోత్సవాలు సందర్భంగా మంగళవారం అమ్మవారికి గ్రామానికి చెందిన మహిళలు ఘనంగా బోనాలు తీశారు. గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు కేపీ రామాగౌడ్‌, లక్ష్మీనారాగౌడ్‌, అధ్యక్షులు అనిల్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు ప్రకాష్‌గౌడ్‌, కార్యదర్శి చంద్రగౌడ్‌, కోశాధికారి నరేశ్‌ గౌడ్‌, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సదాశివనగర్‌లో..

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో బోనాలను ఊగించారు. భక్తులకు భారీ ఎత్తున అన్నదానం చేశారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ఉత్తునూర్‌లో ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంత చేయాలని వారు కోరారు.

దోమకొండ: మండల కేంద్రంలో ఐదు రోజులుగా జరుగుతున్న ఊర పండుగ మంగళవారం ముగిసింది. ఉదయం నుంచి ఊరడమ్మ, సార్గమ్మల వద్ద ప్రత్యేక పూజలతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊరంతా తిరిగి మళ్లీ వనభోజనాలకు వెళ్లారు. గ్రామ సర్పంచ్‌ ఐరేని నర్సయ్య, ఉప సర్పంచ్‌ బొమ్మెర శ్రీనివాస్‌, ఊర పండగ నిర్వాహకులు మర్రి శేఖర్‌, సిద్ధారెడ్డి, కూర చంద్రం, పున్న రాములు, సంతోష్‌ రెడ్డి, తదతరులు పాల్గొన్నారు.

రేణుకాదేవి ఎల్లమ్మ కల్యాణోత్సవం 
1
1/2

రేణుకాదేవి ఎల్లమ్మ కల్యాణోత్సవం

రేణుకాదేవి ఎల్లమ్మ కల్యాణోత్సవం 
2
2/2

రేణుకాదేవి ఎల్లమ్మ కల్యాణోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement