కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పిలుపు
కామారెడ్డి టౌన్: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన 420 కాంగ్రెస్ పార్టీని, వారి అభ్యర్థుల ను ఈ మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్ వీజీ గౌడ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్‌లతో కలిసి పార్టీ అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కాంగ్రెస్ పార్టీ వందలాది హామీలిచ్చి ప్రజల ను వంచించిందని ధ్వజమెత్తారు. అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో.. పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని, ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని ప్రతిజ్ఞ చేయించారు. పట్టణ పార్టీ అధ్యక్షు డు జూకంటి ప్రభాకర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి బల్వంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.
స్నేహితుడి తల్లి అంత్యక్రియల్లో..
భిక్కనూరు: స్నేహితుడి తల్లి అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మంగళవారం పాల్గొన్నారు. బస్వాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌లు చిన్ననాటి మిత్రులు. మంగళవారం గంగారెడ్డి తల్లి బుచ్చిరాజమ్మ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న గంప గోవర్ధన్ బస్వాపూర్ గ్రామానికి వచ్చి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


