అనారోగ్యంతో లైన్‌మన్ మృతి
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రానికి చెందిన లైన్‌మన్ జంగం నాగప్ప(50) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న నాగప్ప ఆరు నెలల క్రితం అనారోగ్యం బారిన పడ్డాడు. చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. నాగప్ప స్వగ్రామం పెద్దకొడప్‌గల్‌లో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని రాంలక్ష్మణ్‌పల్లి గ్రామంలో ఓ ఇంట్లో మంగళవారం నాలుగు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లకావత్ రాము కొంతకాలంగా తన ఇంట్లో నాటుసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు మంగళవారం ఇంట్లో సోదాలు నిర్వహించామన్నారు. కూలర్‌లో రెండు ప్లాస్టిక్ సీసాల్లో అక్రమంగా దాచి ఉంచిన నాలుగు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని రాముపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పిట్లం(జుక్కల్): మండల కేంద్రమైన పిట్లంలో సోమవారం రాత్రి జరిగిన బైక్ చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాన్సువాడ నుంచి వచ్చిన క్లూస్ టీం అధికారి ప్రవీణ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, వేలిముద్రలు సేకరించారు. ఆయన వెంట పిట్లం ఎస్సై వెంకట్రావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
అనారోగ్యంతో లైన్‌మన్ మృతి


