ఎల్లారెడ్డిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
● ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు బి–ఫాంలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎల్లారెడ్డి ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. 18 నెలల కాలంలో మినీ ట్యాంకు బండ్ అభివృద్ధి చేయడంతో పాటు, రూ.5 కోట్లతో నూతన బస్టాండ్ నిర్మించినట్లు తెలిపారు. అలాగే వివిధ పనులకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.. రానున్న రోజులలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి మరిన్ని నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి పథంలో నిలుపుతామని అన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ పద్మశ్రీకాంత్, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
బగళాముఖీ క్యాలెండర్ల ఆవిష్కరణ
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు మంగళవారం బగళాముఖీ అమ్మవారి క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఎల్లారెడ్డిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన క్యాలెండర్లు ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలని అన్నారు. జ్యోతిష్య పండితులు క్రాంతి పటేల్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచర్ల బాలకిషన్, కృష్ణాగౌడ్ తదితరులున్నారు.


