పశుపోషకులకు అధికారుల నోటీసులు | - | Sakshi
Sakshi News home page

పశుపోషకులకు అధికారుల నోటీసులు

Feb 4 2026 7:07 AM | Updated on Feb 4 2026 7:07 AM

పశుపోషకులకు అధికారుల నోటీసులు

పశుపోషకులకు అధికారుల నోటీసులు

దురుసుగా ప్రవర్తించిన

ఒకరిపై కేసు నమోదు

నిజాంసాగర్‌(జుక్కల్‌): మహమ్మద్‌ నగర్‌ మండలం గిర్నితండా గ్రామ పంచాయతీ పరిధిలోని కొన, నడిమి, గిర్నితండాల్లోని పశుపోషకులకు మండల పరిషత్‌, గ్రామపంచాయతీ అధికారులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. ‘సర్వీస్‌ రోడ్లే పశువుల కొట్టాలు’ అంటూ సోమవారం సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు మండల పరిషత్‌ అధికారుల ఆదేశాల మేరకు గిర్నితండా గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌరి.. పశుపోషకులకు నోటీసులు ఇచ్చారు. సర్వీస్‌ రోడ్లపై పశువులను కట్టేయడమే కాకుండా నోటీసు తీసుకోకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌరిపై దురుసుగా ప్రవర్తిస్తూ, విధులకు ఆటంకం కల్గించాడు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి గౌరి నిజాంసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో హరిసింగ్‌పై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై శివకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement