లెక్క తేలింది
ఇక ప్రచార పర్వంలోకి..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఏ వార్డునుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారో తేలిపోయింది. చివరి రోజైన మంగళవారం జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీల రెబల్స్, స్వతంత్రులు కలిపి మొత్తం 217 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 92 వార్డుల్లో మొత్తం 447 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు అన్ని వార్డులనుంచి బరిలో నిలవగా.. బీజేపీ నుంచి 89 వార్డుల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎంఐఎం 10, బీఎస్పీ 4, సీపీఎం 3, ఆప్ ఒక స్థానంలో అభ్యర్థులను నిలపగా.. ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీలనుంచి 18 మంది, స్వతంత్రులు 138 మంది పోటీ చేస్తున్నారు.
బాన్సువాడలో..
బాన్సువాడ పట్టణంలో 19 వార్డుల పరిధిలో 85 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అన్ని వార్డులలో, బీజేపీ 17 వార్డులో పోటీ చేస్తుండగా.. స్వతంత్రులు 30 మంది బరిలో నిలిచారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 45 మంది ఎన్నికల బరిలో మిగిలారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజీపీ అన్ని స్థానాలనుంచి పోటీ చేస్తుండగా.. బీఎస్పీ రెండు స్థానాల్లో బరిలో ఉంది. ఏడుగురు స్వతంత్రులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క తేలడంతో ప్రచారం జోరందుకోనుంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అభ్యర్థులు వెంటనే రంగంలోకి దూకారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూనే సంఘాలతో సమావేశమవుతున్నారు. హామీలను గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బరిలో మిగిలిన వారి లెక్కతోపాటు స్వతంత్రుల గుర్తులు తేలడంతో బుధవారం నుంచి ప్రచారం మరింత జోరందుకునే అవకాశాలున్నాయి.
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారంతో ముగిసింది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అన్ని స్థానాలనుంచి పోటీ చేస్తుండగా.. బీజేపీ 89 వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. అభ్యర్థుల లెక్క తేలడంతో ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది.
– సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్
చివరి రోజు 217 నామినేషన్ల
ఉపసంహరణ
92 వార్డులనుంచి బరిలో
447 మంది..
అన్నివార్డులలో కాంగ్రెస్,
బీఆర్‌ఎస్ అభ్యర్థులు
89 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ
కామారెడ్డి బల్దియాలో 49 వార్డులుండగా.. 254 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అన్ని స్థానాలలో అభ్యర్థులను నిలిపాయి. బీజేపీ 48 వార్డుల్లో, ఎంఐఎం 8 చోట్ల, జనసేన 7, టీఆర్‌ఏపీ 6, సీపీఎం 3, బీఎస్పీ, ఏఐఎఫ్‌బీ, ఆప్ ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి. స్వతంత్రులు 81 మంది పోటీలో ఉన్నారు.
లెక్క తేలింది


