‘బాలల రక్షణ అందరి బాధ్యత’ | - | Sakshi
Sakshi News home page

‘బాలల రక్షణ అందరి బాధ్యత’

Feb 4 2026 7:05 AM | Updated on Feb 4 2026 7:05 AM

‘బాలల

‘బాలల రక్షణ అందరి బాధ్యత’

‘బాలల రక్షణ అందరి బాధ్యత’ ‘పోచారం’లో రొయ్యపిల్లల విడుదల ‘భద్రతకు తొలి ప్రాధాన్యత’ ‘నైపుణ్యాలను పెంపొందించుకోవాలి’ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి టౌన్‌: బాలల హక్కుల పరిరక్షణ ప్ర తి ఒక్కరి బాధ్యతని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె కా మారెడ్డిలోని బాల సదన్‌, భవానీపేట్‌లోని ఇండియన్‌ జిప్సీ ట్రస్ట్‌ చిల్డ్రన్‌ హోమ్‌లను తని ఖీ చేశారు. చిన్నారులతో ముచ్చటించారు. వా రి ఆరోగ్యం, విద్యా సౌకర్యాలపై ఆరా తీశారు. వంటగదిలోని సరుకులను, నివాస గదులను పరిశీలించారు. చిన్నారులకు నాణ్యమైన ఆహారం, వసతులు అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు.

నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టులో మంగళవా రం మెదక్‌ జిల్లాకు చెందిన మత్స్యసహకార శా ఖ అధికారులు రొయ్యపిల్లలను విడుదల చేశా రు. ప్రాజెక్టులో 5.85 లక్షల రొయ్యపిల్లలను విడుదల చేసినట్లు మెదక్‌ జిల్లా మత్స్యసహకారశాఖ అధికారి మల్లేశం తెలిపారు. కార్యక్ర మంలో పోచారం సర్పంచ్‌ సంజీవరావు, మె దక్‌ జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం చైర్మన్‌ దేవేందర్‌, ఇరిగేషన్‌ అధికారి టింకు, జిల్లా డైరెక్టర్‌ శ్రీనివాస్‌, పోచారం మ త్స్యసహకార సంఘం కార్యదర్శి శివయ్య, సభ్యులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: ప్రతి విద్యుత్‌ ఉద్యోగి అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ రాపెల్లి రవీందర్‌ సూచించారు. మంగళవారం కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో విద్యుత్‌ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ రవీందర్‌ విద్యుత్‌ భద్రత అంశాలపై చర్చించి ప్రతిజ్ఞ చేయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ లైన్‌ క్లియరెన్స్‌ యాప్‌ ద్వారా ఎల్‌సీ తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయో ముందుగానే పసిగట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈలు కళ్యాణచక్రవర్తి, శ్రీనివాస్‌గౌడ్‌(టెక్నికల్‌), ఏడీఈలు, ఏఈలు, సబ్‌ ఇంజినీర్లు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: అధ్యాపకులు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి నిరంతం కృషి చేయాలని కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ సూచించారు. కళాశాలలో మంగళవారం ‘పరిశోధనాత్మక వ్యాసం ఎలా రాయాలి’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఒరవడి, ఉన్నత ప్రమాణాలతో వివిధ అంశాలపై పరిశోధన పత్రాలు రూపొందించాలని సూచించారు. సదస్సులో రిసోర్స్‌ పర్సన్‌ అంకం జయప్రకాష్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ కిష్టయ్య, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

లింగంపేట: ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను ప క డ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడి యట్‌ నోడల్‌ అధికారి షేక్‌ సలాం సూచించా రు. మంగళవారం లింగంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రాక్టికల్‌ పరీక్ష లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉదయం నిర్వహించిన ప్రాక్టికల్‌ పరీక్షలకు సైన్స్‌ కోర్సుల్లో 1,123 మంది విద్యార్థులకుగాను 1,103 మంది, ఒకేషనల్‌ పరీక్షలకు 1,202 మంది విద్యార్థులకుగాను 1,085 మంది హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 922 మందికిగాను 909 మంది, ఒకేషనల్‌ విభాగంలో 1,098 మందికిగాను 1,043 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఆయన వెంట ప్రిన్సిపల్‌ నరేందర్‌, అధ్యాపకులు ఉన్నారు.

‘బాలల రక్షణ  అందరి బాధ్యత’
1
1/3

‘బాలల రక్షణ అందరి బాధ్యత’

‘బాలల రక్షణ  అందరి బాధ్యత’
2
2/3

‘బాలల రక్షణ అందరి బాధ్యత’

‘బాలల రక్షణ  అందరి బాధ్యత’
3
3/3

‘బాలల రక్షణ అందరి బాధ్యత’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement