6న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి ఈ నెల 6వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. సీఎం అయ్యాక రేవంత్‌రెడ్డిది మొదటి అధికారిక పర్యటన కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశాపూర్ గ్రామం వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి మంగళవారం సభాస్థలి వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి రేవతంరెడ్డి జి ల్లా అభివృద్ధికి సంబంధించి దిశానిర్దేశం చేసే కీల కమైన ప్రకటనలు చేయనున్నారన్నారు. సుమారు 50వేల మందితో సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం పర్యటన చారిత్రక ఘట్టం కానుందన్నారు. జిల్లా ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వారివెంట నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, డీసీసీ కార్యదర్శి గడ్కోల్ భాస్కర్‌రెడ్డి, బీరెడ్డి సంతోష్‌రెడ్డి, జావెద్ అక్రమ్, కేశాపూర్, బర్థిపూర్, ఽకంజర్, ధర్మారం సర్పంచ్‌లు గంగారెడ్డి, భాస్కర్, రాకేశ్‌యాదవ్, వాసుబాబు, రూరల్ యూత్ నాయకుడు నరేశ్, పెంటాజీ తదితరులు ఉన్నారు.
బహిరంగ సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి,
డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి
కాంగ్రెస్ శ్రేణులు భారీగా
తరలిరావాలని పిలుపు


