ఎలక్షనంటే ‘చీప్’ కాదోయ్!
పట్టణాల్లో ఎలక్షన్ అంటే సాదాసీదాగా ఉండదు కదా.. పేదలు నివసించే కొన్ని స్లమ్ ఏరియాలు మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో మధ్య తరగతి ప్రజలు, ఉన్నత వర్గాల వారే ఉంటారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతలు, అభ్యర్థులు ఓటర్ల చెంతకు వెళుతున్నారు. రాత్రికి గల్లీ సంఘాలు, సిండికేట్లు, సొసైటీలు, కుల సంఘాలు... ఇలా వివిధ వర్గాల వారీగా సిట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే చీప్ లిక్కరో, సాధారణ బ్రాండ్ల మద్యమో ఇస్తే ఓటర్లు ఒప్పుకోవడం లేదట. చాలా చోట్ల ఖరీదైన బ్రాండెడ్ లిక్కరే అడుగుతున్నారట. అభ్యర్థులు కూడా ఓటరు కోరిన విలువైన మద్యాన్ని ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి


