పూర్వ విద్యార్థుల సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Feb 3 2026 7:20 AM | Updated on Feb 3 2026 7:20 AM

పూర్వ

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

బీబీపేట: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 2002–03 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు సోమవారం ఆపూర్వ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చదువుకునే రోజుల్లో చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకున్నారు. 2028 సంవత్సరంలో సిల్వర్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు.

సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయ వార్షికోత్సవం

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): బెజుగంచెరువుతండాలో గల జగదాంబ సమేత సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని సోమవారం తండావాసులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పురోహితులు శివకుమార్‌ శర్మ, పూజారి కిషన్‌ నాయక్‌ ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యహవాచనం, విశేష అభిషేకం, హోమాలు–పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో జరిపారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ వార్షికోత్సవ కార్యక్రమానికి పౌర పీఠాధిపతి బాబుసింగ్‌ మహారాజ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. తండావాసులు మద్యం, ఇతర దురవాట్లను వీడి సన్మార్గంలో నడవాలన్నారు. భగవంతుడిని నమ్ముకొని తల్లిదండ్రుల సేవలో చక్కని జీవనం గడపాలని చెప్పారు. భద్యానాయక్‌, సర్పంచ్‌లు భాస్కర్‌, బాల్యానాయక్‌, ప్రభుగౌడ్‌, నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై భార్గవ్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభమైన ఎల్లమ్మ ఆలయ ఉత్సవాలు

దోమకొండ: ముత్యంపేట గ్రామ ఎల్లమ్మ ఆలయంలో ఆలయ వార్షికోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతిపూజ, సాయంత్రం శావ కార్యక్రమం నిర్వహించారు. గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు కేపీ రామాగౌడ్‌, లక్ష్మీనారాగౌడ్‌, అధ్యక్షులు అనిల్‌గౌడ్‌, ఉపాధ్యక్షులు ప్రకాష్‌ గౌడ్‌, కార్యదర్శి చంద్రగౌడ్‌, కోశాధికారి నరేశ్‌ గౌడ్‌, కమిటీ డైరెక్టర్లు, తదితరులున్నారు.

ఘనంగా మల్లన్న జాతర

భిక్కనూరు: గుర్జకుంట శివారులో ఉన్న మల్లన్న ఆలయం వార్షికోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. వేకువజామునుంచే యాదవ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా భిక్కనూరు గ్రామ పంచాయతీ 14వ వార్డు సభ్యుడు జ్ఞానప్రకాశ్‌రెడ్డి భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి బోనాలను సమర్పించారు.

ఆధ్యాత్మికం

పూర్వ విద్యార్థుల సమ్మేళనం 1
1/3

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2
2/3

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పూర్వ విద్యార్థుల సమ్మేళనం 3
3/3

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement