కాలకృత్యాలు తీర్చుకునేందుకూ ఇబ్బందులే
త్వరగా పూర్తి చేయించండి
సమస్యలను పరిష్కరిస్తాం
● వడ్లం జెడ్పీహెచ్‌ఎస్‌లో అసంపూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణం
● ఇబ్బంది పడుతున్న విద్యార్థినులు,
ఉపాధ్యాయులు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): వడ్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో బాలికలతో పాటు, మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు చెందిన పాత మూత్రశాలలు, మరుగు దొడ్లు శిఽథిలావస్థకు చేరడంతో రెండు సంవత్సాల క్రితం కూల్చివేశారు. అప్పటి నుంచి పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. రెండు పాఠశాలల్లో కలిపి దాదాపు 250ి మందికిపైగా చదువుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమీపంలోని ఇళ్ల మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. బాలురు పాఠశాల బయటకు చెరువు కట్టవైపు వెళ్తుండటంతో ఏదైనా ప్రమాదం జరుగుతుందోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందతున్నారు. జెడ్పీ పాఠశాలలో నూతన మరుగుదొడ్ల నిర్మాణం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బాలురు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్ల నిర్మాణ పనులకు రూ.4 లక్షల చొప్పున నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో నిర్మాణ పనులను ప్రారంభించడంలో సంబంధిత అధికారులు జాప్యం చేశారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ప్రారంభించినా మధ్యలోనే నిలిపి వేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
మేము పేద్ద దేవిసింగ్ తండా నుంచి వస్తాం. మూత్రశాల లు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది కలుగుతుంది. పాఠశాల సమీపంలోని ఇళ్లలోకి వెళ్లి కా లకృత్యాలు తీర్చుకుంటున్నాం. అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పూర్తి చేసి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం.
– సుజిత, విద్యార్థిని, వడ్లం జెడ్పీహెచ్‌ఎస్
రూ.4 లక్షలతో రెండు యూ నిట్ల మూత్రశాల, మరుగు దొడ్ల పనులు గతంలో ప్రా రంభించారు. డబ్బులు రాక పోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మరో రూ. 6 లక్షలతో మూడు యూనిట్‌లు త్వరలో ప్రా రంభం చేస్తున్నారు. నిలిచిపోయిన మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు పున:ప్రారంభం చే యించి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం.
– ప్రవీణ్ కుమార్, ఏఈవో, పెద్దకొడప్‌గల్
కాలకృత్యాలు తీర్చుకునేందుకూ ఇబ్బందులే


