ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి

Feb 3 2026 7:20 AM | Updated on Feb 3 2026 7:20 AM

ఎస్జీ

ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి

ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి సోషల్‌ టాలెంట్‌ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ తాడ్వాయి ఎంపీడీవోగా సవితారెడ్డి కాంగ్రెస్‌ మండల మహిళా అధ్యక్షురాలిగా మాధవి

బాన్సువాడ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలని ఎస్జీటీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం బాన్సువాడలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 5న ఏఐ జాక్టో ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పేరుతో తెలంగాణలో ఉన్న 35 ఉపాధ్యాయ సంఘాలు పాల్గొంటున్నాయని, ఎస్జీటీలందరూ అందుబాటులో ఉన్న ఉపాధ్యాయ సంఘాన్ని కలిసి ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని సూచించాలని, జీవో–25ను మార్చే విధంగా సవరణలు తేవాలని.. ఉపాధ్యాయ సంఘాలపై ఒత్తిడి చేసేలా అడగాలని అన్నారు. ఎస్జీటీలు పవార్‌ హీరాలాల్‌, చింతల విజయ్‌, వెంకటరమణ, పండరి, శ్రీనివాస్‌నాయక్‌, రవి, వాజీద్‌ తదితరులు ఉన్నారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): తిర్మన్‌పల్లికి చెందిన ఆరె సంజన, శ్లోక అనే ఇద్దరు విద్యార్థులు సోషల్‌ టాలెంట్‌ టెస్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం తెలంగాణ సాంఘిక రాష్ట్ర ఉపాధ్యాయుల ఫోరమ్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన టెస్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 7న రాష్ట్ర స్థాయిలో టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు బాల్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులను మెమోంటోలతో సత్కరించి అభినందించారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిగా సవితారెడ్డి సోమ వారం బాధ్యతలు తీసుకున్నారు. తాడ్వాయి ఎంపీడీవోగా పనిచేసిన సాజీద్‌అలీ పదవీ విరమణ పొందడంతో మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీవోగా పని చేస్తున్న సవితకు ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాడ్వాయి మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీ నాయకులు, అధికారులు అభినందించారు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కాంగ్రెస్‌ మండల మహిళా అధ్యక్షురాలిగా చీనూర్‌ గ్రామానికి చెందిన మ్యాకల మాధవిని నియమించినట్లు సోమవారం కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు మాధవికి ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్‌ అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్‌ మండల ప్రధాన కార్యదర్శి కిష్టయ్య, నాయకులు రాంచందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇమామ్‌, కిరణ్‌, మహేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి 
1
1/3

ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి

ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి 
2
2/3

ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి

ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి 
3
3/3

ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement