రాజకీయ కుటుంబాల నుంచి పోటీలో కోడళ్లు | - | Sakshi
Sakshi News home page

రాజకీయ కుటుంబాల నుంచి పోటీలో కోడళ్లు

Feb 3 2026 7:20 AM | Updated on Feb 3 2026 7:20 AM

రాజకీ

రాజకీయ కుటుంబాల నుంచి పోటీలో కోడళ్లు

50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో షెట్కార్‌, నాల్చర్‌ కుటుంబాలు

మామ, భర్త ఆశయాలు నెరవేరుస్తాం

బిచ్కుంద(జుక్కల్‌): బిచ్కుంద పట్టణానికి చెందిన రెండు రాజకీయ కుటుంబాల నుంచి ఇద్దరు కోడళ్లు మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. స్వర్గీయులు మల్లికార్జునప్ప షెట్కార్‌, నాల్చర్‌ శ్రీహరి ఇద్దరూ జుక్కల్‌ నియోజకవర్గంలో 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో రాణిస్తూ జిల్లాతో పాటు రాష్ట్రస్దాయి వరకు ఎదిగి గుర్తింపు పొందారు.

నాల్చర్‌ ఫ్యామిలీ..

నాల్చర్‌ శ్రీహరి రెండో కోడలు శిరీష 3వ వార్డు అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నాల్చర్‌ శ్రీహరి 1978లో మద్నూర్‌ తాలుకా ఎల్‌ఎండీ చైర్మన్‌గా, 1981లో బిచ్కుంద సొసైటీ చైర్మ న్‌గా, 1990లో ఎంపీపీ, 1996లో జెడ్పీటీసీ, రెండు పర్యాయాలు ఏఎంసీ చైర్మన్‌గా వివిధ హోదాలలో పని చేశారు. అలాగే పెద్ద కోడలు నాల్చర్‌ భారతి రాజు 2019లో జెడ్పీటీసీగా పని చేశారు. రెండో కుమారుడు బాలాజీ 2025 వరకు బిచ్కుంద సొసైటీ చైర్మన్‌గా కొనసాగారు. మామ శ్రీహరి, భర్త బాలాజీ అడుగుజాడలో నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేయడానికి రాజకీయాల్లో అడుగు పెట్టానని నాల్చర్‌ శిరీష తెలిపారు.

షెట్కార్‌ వారసురాలిగా సీమా రమేశ్‌..

మల్లికార్జునప్ప షెట్కార్‌ కుటుంబం నుంచి రెండో కోడలు సీమా రమేష్‌ షెట్కార్‌ 12వ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్దియా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2014లో సీమా షెట్కార్‌ ఎంపీటీసీగా గెలుపొందారు. మల్లికార్జునప్ప షెట్కార్‌ మద్నూర్‌, బిచ్కుంద ఏఎంసీ చైర్మన్‌గా కొనసాగారు. మామ మల్లికార్జునప్ప, భర్త రమేష్‌ షెట్కార్‌ వారసురాలుగా సీమా షెట్కార్‌ రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. వారి అడుగు జాడలోనడిచి ఆశయా లు నెరవేరుస్తానంటున్నారు. బిచ్కుందకు మొదటిసారిగా మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే చైర్‌పర్సన్‌గా చేయ డానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రెండు కుటుంబాలు ప్రజా సేవకే అంకితం అంటున్నారు.

నాల్చర్‌ శిరీష, 3వ వార్డు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి

సీమా షెట్కార్‌, 12వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి

రాజకీయ కుటుంబాల నుంచి పోటీలో కోడళ్లు 1
1/1

రాజకీయ కుటుంబాల నుంచి పోటీలో కోడళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement