రాజకీయ కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
బాన్సువాడ: రాజకీయ కక్షతోనే మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు ఆదివారం బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చిన నాయకుడికి ఇంతలా అవమానించడం తగదని, ప్రజలు త్వరలోనే కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బాన్సువాడలో గులాబీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్, యలమంచలి శ్రీనివాస్‌రావు, చందర్, శివ, రమేష్‌యాదవ్, మోచీ గణేష్, ఇషాక్, సాకలి సాయిలు, రమేష్, గాండ్ల కృష్ణ, ఉమ మహేష్ తదితరులు ఉన్నారు.


