క్రైం కార్నర్
గొర్రెను కాపాడబోయి కాపరి మృతి
బీబీపేట: గొర్రెను కాపాడబోయి గొర్ల కాపరి మృతి చెందిన ఘటన బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్ల లింగం(55) గ్రామ శివారులో గొర్లను మేపేందుకు వెళ్లాడు. యాడారం గ్రామ చెరువు వద్ద చెరువు దాటే క్రమంలో ఓ గొర్రె అందులో పడగా దానిని కాపాడేందుకు లింగం చెరువులోకి దిగాడు. దీంతో నీట మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
క్రైం కార్నర్


