అంబేడ్కర్‌నగర్‌లో ఇల్లు దగ్ధం
బోధన్‌టౌన్: పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ కాలనీకి చెందిన శంకర్ ఇల్లు ఆదివారం షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఇంటి నుంచి పొగలు రావడంతో కుటు ంబీకులు కేకలు వేస్తూ బయటకు వచ్చారు. స్థానికులు వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశా రు.కాగా అప్పటికే ఇంట్లో వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆ ర్పివేశారు. రూ.లక్షా50వేల ఆస్తి నష్టం వా టిళ్లినట్లు బాధితులు తెలిపారు. బాధిత కుటుంబానికి మున్సి పల్ మాజీ చైర్మన్ తూము పద్మ, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నేతలు నగదు, బియ్యం అందజేశారు.


