నాటి బానిసవాడనే నేటి బాన్సువాడ | - | Sakshi
Sakshi News home page

నాటి బానిసవాడనే నేటి బాన్సువాడ

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

నాటి

నాటి బానిసవాడనే నేటి బాన్సువాడ

ఎంపీపీలుగా పదవులు అనుభవించిన బాన్సువాడ ప్రముఖులు...

అప్పట్లో ప్రజా సేవకు తపించాం

పాతూరు.. కొత్తూరు..

పదవుల కోసం రెండింటి మధ్య పోటీ

బాన్సువాడ : రజాకార్ల కాలంలో బానిసవాడగా పిలువబడే ప్రాంతమే నేటి బాన్సువాడ. స్వాతంత్య్రం రాక పూర్వం నిజాం పాలన కాలంలో దోమకొండ ఆస్థానం వారు పాత బాన్సువాడలో గడీలను ఏర్పాటు చేసుకుని పాలన కొనసాగించే వారు. అప్పట్లో ఉన్న పోలీసు వ్యవస్థను పాత బాన్సువాడ ఆస్థానంలో ఉన్న లక్ష్మారెడ్డి అనే వ్యక్తి మంచికి చెడుకు ముందుండేవారట. పోలీసులు పాత బాన్సువాడకు రావాలంటే లక్ష్మారెడ్డి అనే వ్యక్తి అనుమతి తీసుకుని వచ్చేవారని చెప్పుకుంటారు. స్వాతంత్య్రం వచ్చాక బానిసవాడకు బాన్సువాడగా నామకరణం చేశారు. అప్పట్లోనే పాత బాన్సువాడ–కొత్త బాన్సువాడగా పిలిచే వారట. కొత్త బాన్సువాడలో నార్ల వారి కుటుంబ, చావుస్‌ల కుటుంబ సభ్యులే అధికంగా ఉండటంతో ప్రతీ సారి జరిగే ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో వంతుల వారీగా పరిపాలన చేసేవారట. బాన్సువాడలో పండగైనా పాత బాన్సువాడ గడీ కాడి నుంచే ప్రారంభిస్తారు. పదవుల పంపకాల్లో ప్రతీ సారి పాతూరు–కొత్తూరు అంటూ లొల్లి పెట్టుకునే వారని తెలిసింది. పాత బాన్సువాడకు చెందిన వారు సర్పంచ్‌గా ఎన్నికై తే కొత్త బాన్సువాడకు చెందిన వార్డు సభ్యుడికి ఉపసర్పంచి ఇవ్వాలనే నిబంధనలు పెట్టుకున్నారు. ఇలా అప్పటి నుంచి నేటి వరకు ఇలాగే పదవుల పంపకాలు కొనసాగుతున్నాయి. 1969లోనే తెలంగాణ స్థాయి కబడ్డీ పోటీలు పాత బాన్సువాడలో నిర్వహించారు. పాత బాన్సువాడకు చెందిన బి. గంగారెడ్డి అనే వ్యాపారవేత్త 1962 –1967 వరకు ఎమ్మెల్యేగా చేశారు. అలాగే పాతూరుకు చెందిన కత్తెర గంగాధర్‌ 1989–1994 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. వీరితో పాటు బాన్సువాడలో నివాసముంటున్న పలువురు మండల ప్రజాప్రతినిధులుగా కొనసాగారు.

పాత బాన్సువాడలో చెక్కు చెదరని పురాతన గడీ

1) నార్ల లింగయ్య (సమితి అధ్యక్షులు)

2) కత్తెర గంగాధర్‌ (ఎంపీపీ)

3) గుడాల విఠల్‌ (ఎంపీపీ)

4) గులెపల్లి శ్రీనివాస్‌ (ఎంపీపీ)

5) కాసుల బాల్‌రాజ్‌ (ఎంపీపీ)

6) జంగం గంగాధర్‌ (ఎంపీపీ)

7) రేష్మ బేగం (ఎంపీపీ)

బాన్సువాడ ఎమ్మెల్యేగా 1989–1994 వరకు పని చే శాను. అప్పట్లో తాను చేసిన అ భివృద్ధి నేటికి కళ్లకు కనప డుతుంది. సంగమేశ్వర కాలనీ కోసం 1993లో 11 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి పేదలకు స్థలాలు పంపిణీ చేశాను. నేడు అదే సంగమేశ్వర కాలనీలో సుమారుగా 8 వేల జనాభా ఉంటోంది. నిరంతరం ప్రజాసేవ కోసమే తపించా. ఇంకా ప్రజలకు ఏదో సేవ చేయాలనే సంకల్పంతో నడుస్తున్నా.

–కత్తెర గంగాధర్‌, మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ

నాటి బానిసవాడనే నేటి బాన్సువాడ 1
1/1

నాటి బానిసవాడనే నేటి బాన్సువాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement