గుండెపోటుతో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడి మృతి

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

గుండె

గుండెపోటుతో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడి మృతి

గుండెపోటుతో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడి మృతి ప్రారంభమైన నర్సరీ పనులు గ్రామాల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం యాడారంలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ జూకంటి సంగారెడ్డి ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. శనివారం సాయంత్రం గుండెపోటుకు గురైన సంగారెడ్డిని కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. మర్కల్‌లో నిర్వహించిన అంత్యక్రియలకు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు.

లింగంపేట(ఎల్లారెడ్డి):మోతెలో ఆదివారం న ర్సరీ పనులు ప్రారంభమైనట్లు సర్పంచ్‌ వజీర్‌ సుజాతాబాయి తెలిపారు. రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటడానికి నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మొక్కల పెంపకానికి మట్టిని సేకరించి కవర్లలో నింపుతున్నట్లు తెలిపారు. విత్తనాలు వేసి మొక్కలు పెరగడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లిసంగారెడ్డి, లింగంపేటతో పాటు పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. ఇటీవల ఎన్నికై న సర్పంచులు పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల్లో మురికి కాల్వల్లో పేరుకుపోయిన పూడికను, పిచ్చి మొక్కలను తొలగిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య పనులకు, వీధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలోనే వేయాలని సూచించారు.

మాచారెడ్డి: పాల్వంచ మండలం ఎల్పుగొండలో కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌–1 ఆధ్వర్యంలో శీతాకాలం ప్రత్యేక శిబిరం చేపట్టారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు గ్రామంలోని రోడ్లపై పిచ్చి మొక్కల తొలగింపు, పరిసరాలను శుభ్రం చేయడం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వంటివి నిర్వహించారు. సర్పంచ్‌ శోభ, ఉప సర్పంచ్‌ రవీందర్‌, వార్డు సభ్యులు శ్రీధర్‌రావ్‌, దేవరాజు, ఎల్లయ్య, అనిల్‌, రాములు, తదితరులు పాల్గొన్నారు.

బీబీపేట: మండలంలోని యాడారం గ్రామంలో తాగునీటి ఎద్దడికి సర్పంచ్‌ గొబ్బూరి సుధారాణి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదవారం గ్రామంలోని 10 వార్డులో బోరు మోటారు రిపేర్‌ చేసి కనెక్షన్‌ ఇచ్చారు. కాలనీలొని తాగునీటి పైపులైన్‌కు కనెక్షన్‌ ఇచ్చారు. వారి వెంట వార్డు సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

గుండెపోటుతో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడి మృతి 1
1/4

గుండెపోటుతో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడి మృతి

గుండెపోటుతో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడి మృతి 2
2/4

గుండెపోటుతో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడి మృతి

గుండెపోటుతో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడి మృతి 3
3/4

గుండెపోటుతో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడి మృతి

గుండెపోటుతో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడి మృతి 4
4/4

గుండెపోటుతో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement