సమాధి దేవాలయం వద్ద మైకుల ఏర్పాటు
● ప్రతి గంట గంటకు భగవద్గీత శ్లోకాలు
భిక్కనూరు: మండల కేంద్రంలో ఉన్న అతి పురాతనమైన సిద్దగిరి రామగిరి సమాధి దేవాలయం వద్ద భక్తులు ఆదివారం మైక్‌లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాది ఆలయం వద్ద 30 ఫీట్ల ఎత్తులో మైక్‌లను అమర్చామని, ప్రజల్లో భక్తిభావాన్ని సనాతన ధర్మాన్ని మరింత పెంపొందించేందుకు ఈ మైక్‌లను ఉపయోగిస్తామన్నారు. ప్రతి గంటకు ఒక్కసారి సమయం చెబుతూ భగవద్గీత శ్లోకాలతో పాటు తాత్పర్యం కూడా ఈ మైక్‌ల ద్వారా వినిపించే విధంగా ఏర్పాటు చేశామన్నారు. దీనివల్ల ప్రజలకు భగవద్గీత గురించి అవగాహన కలుగుతుందన్నారు.
కామారెడ్డి అర్బన్: సంస్కారభారతి కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కూచిపూడి కళాక్షేత్రంలో భరతముని సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కూచిపూడి కళాక్షేత్రం కళాకారులు ప్రదర్శించిన నాట్య ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా జాతీయ కళాకారుడు వంశీప్రతాప్‌గౌడ్, నాట్య గురువులు కనకతార, హర్షితలను సన్మానించారు. సంస్కార భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పాతూరి సత్యప్రసాద్, ప్రతినిధులు రాజు, స్వామిగౌడ్, మాతృశక్తి కన్వీనర్ నాగపురి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద పరంజ్యోతి కల్కిసేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ప్రజలకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఈ అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. భిక్కనూరులో అంగడి సందర్భంగా అమ్మ స్వామి వార్ల అన్న ప్రసాదాన్ని ప్రజలకు పంపిణీ చేశామన్నారు. తమ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. సమితి ప్రతినిధులు ఎర్రం చంద్రశేఖర్, దిగంబర్, సిద్దంశెట్టి శ్రీనివాస్, ఎర్రం విజయ్, ఎర్రం వినోద్, కాశీనాథం, గంజి శ్రీనివాస్, అల్లాడి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
సమాధి దేవాలయం వద్ద మైకుల ఏర్పాటు
సమాధి దేవాలయం వద్ద మైకుల ఏర్పాటు


