ప్రజల దృష్టి మరల్చడానికే అక్రమ కేసులు
● త్వరలోనే సీఎం బావమరిది
అక్రమాలు బయటపెడతాం
● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసుల వ్యవహరం కొనసాగిస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఓ ఫెయిల్యూర్ సీఎం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేధిస్తే ఊరుకునేది లేదన్నారు. కేసీఆర్ ఇంటి గోడకు నోటీసులు అట్టించడం రేవంత్‌రెడ్డి చిల్లరబుద్ధికి నిదర్శనమన్నారు. ఇలాంటి కేసులకు కేసీఆర్ బయటపడేవారుకాదని, ఉద్యమ కాలంలో అనేక కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి కుంభకోణాల చిట్టా బయటపెడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. దీంతో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దారిమళ్లించడానికే రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నరని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసుల పరిధిలో ఉన్న అంశం అని దానికి అనుమతులు హోం సెక్రెటరీ ఇస్తారని సీఎంకు, మంత్రులకు సంబంధం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతియడానికి విచారణకు పిలుస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని దెబ్బతీయడానికే అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్త, బీఆర్‌ఎస్ లీగల్ సెల్ కార్యదర్శి మధుసూదన్‌రావు, మాజీ కార్పొరేటర్ విశాలినీరెడ్డి, సుమనరెడ్డి, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


