సీసీ రోడ్డు పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

సీసీ

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం అ‘పూర్వ’ సమ్మేళనం

బీబీపేట: మల్కాపూర్‌లో ఆదివారం సీఆర్‌ఆర్‌ నిధులు రూ.20 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. సర్పంచ్‌ రామగల్ల నాగరాజు, బీజేపీ నాయకుల చేతులు మీదుగా పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ప్రవీణ్‌, స్వామిగౌడ్‌, రంజిత్‌గౌడ్‌, పోస శివకుమార్‌, సంతోష్‌ రెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

సదాశివనగర్‌: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌కు చెందిన 1989–90 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 35 ఏళ్ల తర్వాత అందరూ ఒకే చోటుకు చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చదువు నేర్పిన గురువులను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

ఒకరి అదృశ్యం

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని రెండో టౌన్‌ పో లీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై సయ్యద్‌ ముజాహిద్‌ ఆదివారం తెలిపారు. హైమద్‌పుర కాలనీకి చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ నదీమ్‌ గత నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రా లేదు.కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ తెలియలేదు.నదీమ్‌ అన్న కొడుకు రెహమాన్‌ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
1
1/1

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement