నోటీసులు ఇవ్వడం కేసీఆర్‌ను అవమానించడమే | - | Sakshi
Sakshi News home page

నోటీసులు ఇవ్వడం కేసీఆర్‌ను అవమానించడమే

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

నోటీసులు ఇవ్వడం కేసీఆర్‌ను అవమానించడమే

నోటీసులు ఇవ్వడం కేసీఆర్‌ను అవమానించడమే

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌

ఎల్లారెడ్డి: కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆరోపించారు. ఆదివారం ఎల్లారెడ్డిలో బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి నల్లజెండాలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీచౌక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చే శారు.అనంతరం జాజాల మాట్లాడుతూ.. కేసీఆర్‌ కు సిట్‌ నోటీసులు జారీ చేయడం ఆయనను అవమానించడమేనని అన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ప్ర భుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని అన్నారు. ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసి తమ పార్టీ నాయకులపై విచారణల పేరిట దా డులకు దిగడం తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు. ఎ న్ని కుట్రలు, డైవర్షన్లు చేసినా ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందన్నారు.జెడ్పీ మాజీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు,బీఆర్‌ఎస్‌ నాయకులు జలంధర్‌రెడ్డి, ము దాం సాయిలు, సతీష్‌, మహేష్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement