
అండగా ఉంటాం..అధైర్య పడకండి
బాన్సువాడ రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారందరికి అండగా ఉంటామని, బాధితులు అధైర్య పడోద్దని ఉమ్మడి నిజామాబాద్ మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సంగోజీపేట్ గ్రామంలో పర్యటించారు. వాగు భారీగా పొంగిపొర్లడంతో సమీపంలోని పంటపొలాల్లో ఇసుక మేటలు వేసి నష్టం జరిగిందన్నారు. సుమారు అరకిలోమీటర్ మేర రోడ్డు ధ్వంసమైందన్నారు. నాయకులు సంగ్రాంనాయక్, మోహన్‌నాయక్, మహ్మద్ ఎజాస్, నార్లసురేష్‌గుప్తా, దిల్‌రాజు,జెట్టి హన్మాండ్లు , రాసాలం సాయిలు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.