
సొంతూళ్లకు వరద బాధితులు
మద్నూర్(జుక్కల్): వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఐదు రోజులుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో గడిపిన వరద బాధితులు ఆదివారం వారి ఊళ్లకు వెళ్లారు. మద్నూర్, డోంగ్లీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఐదు రోజులుగా సుమారు 500 మందికి అధికారులు ఆశ్రయం కల్పించారు. ఆదివారం వరద బాదితులకు భోజనం, టిఫిన్, పండ్లు ప్యాకింగ్ చేసి వారితో పంపించారు. స్కూల్ బస్సులలో, ట్రాక్టర్‌ల ద్వారా డోంగ్లీ మండలంలోని సిర్‌పూర్, చిన్న టాక్లీ, పెద్ద టాక్లీ గ్రామాల ప్రజలు తరలివెళ్లారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు సాయం అందించిన ప్రతి ఒక్కరికి తహసీల్దార్ ముజీబ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి పట్టణంలోని బగలా ముఖీ అమ్మవారి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులు రేవంత్‌అప్ప, సతీష్, వెంకటేశం, సాయినాథ్, శివరాజు, సతీష్ తదితరులున్నారు.

సొంతూళ్లకు వరద బాధితులు