
‘ఫసల్ బీమా యోజనను అమలు చేయాలి’
భిక్కనూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం రాష్ట్రంలో అమలులో ఉండిఉంటే పంట నష్టపోయిన రైతులకు ఉపయోగపడేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులుతో కలిసి భిక్కనూరు మండల కేంద్రంతో పాటు అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, రామేశ్వర్‌పల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు, రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలతో పంటలు నష్టపోయినవారికి ఎకరాకు రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికి సంబంధించిన రూ. 2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేయాలన్నారు. ఆయన వెంట కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు రమేశ్, నాయకులు శ్రీనివాస్, నిరంజన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లింగారెడ్డి, రాజయ్య, తిరుమలేష్, గణేష్‌రెడ్డి, మల్లారెడ్డి విద్యాసాగర్‌రెడ్డి, భూపతి, వెంకటరెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట: పంట నష్టం వివరాలను సేకరించి బాధిత రైతులకు త్వరగా పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన రాజంపేట నుంచి ఆర్గోండకు వెళ్లే రోడ్డును పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో దెబ్బతిన్న రోడ్డుకు ఆర్‌అండ్‌బీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. మండలంలో దెబ్బతిన్న ఇళ్ల వివరాలను సేకరించి నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇనాంతండా వద్ద చేపట్టిన రోడ్డు మరమ్మతులను వేగవంతం చేయాలని, గ్రామాలలో ఎలాంటి పారిశుద్ధ్య సమస్య రాకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట కామారెడ్డి ఆర్డీవో వీణ, ఆర్‌అండ్‌బీ ఈఈ మోహన్, మండల ప్రత్యేక అధికారి అపర్ణ, ఏడీఏ అపర్ణ, తహసీల్దార్ జానకి, ఎంపీడీవో బాలకృష్ణ తదితరులున్నారు.

‘ఫసల్ బీమా యోజనను అమలు చేయాలి’