
బాధితులకు సాయం అందేలా చూస్తాం
కామారెడ్డి టౌన్: ‘‘పేపర్లలో, టీవీలలో కామారెడ్డి వార్తలు విని, చూసి చాలా ఆవేదనకు గురయ్యాం. జీఆర్ కాలనీలో ఒక్కో బాధితుడు వరదల్లో మూడు రోజుల పాటు పడ్డ కష్టాలను వింటుంటే కన్నీళ్లు ఆగ లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి బాధి తులకు సాయం అందేలా చూస్తాం’’ అని ఎమ్మెల్సీ విజయశాంతి పేర్కొన్నారు. ఆదివారం ఆమె ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, శంకర్‌నాయక్‌లతో కలిసి జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీ, హౌసింగ్‌బోర్డు కౌండిన్య ఎన్‌క్లేవ్‌లలో పర్యటించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వరదల వల్ల కలిగిన నష్టాన్ని వివరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బాధితులకు భారీ నష్టపరిహారం లేదా ప్రత్యేక ప్యాకే జీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా వరద బాధితులను ఆదుకు నే విషయమై స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు.
కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌లను కాదని బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఇక్కడి ప్రజలను దోషులుగా చేసి ఆయన మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. కామారెడ్డి వరద ఘటనపై శాసన మండలి చైర్మన్ అనుమతితో ప్రత్యేకంగా చర్చిస్తామన్నారు. లాస్ అసెస్‌మెంట్ కమిటీ(ఎల్‌ఏసీ) ఏ ర్పాటు చేసి అత్యధిక పరిహారం అందించేలా చూస్తామన్నారు. బాధితులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. వరదల వల్ల వాటిల్లిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందించి, బాధితులకు అండగా నిలుస్తామని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, పీసీసీ జనరల్ సెక్రెటరీ గిరిజా షెట్కార్, నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, చంద్రకాంత్‌రెడ్డి తదితరులున్నారు.
ఎమ్మెల్సీలు విజయశాంతి,
దయాకర్, వెంకట్, శంకర్‌నాయక్
జిల్లా కేంద్రంలో పర్యటన
కేంద్ర ప్రభుత్వం,
స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం