
ఊరంతా ఒక్కటై.. మద్య నిషేధానికి జై
● స్వచ్ఛందంగా మద్య నిషేధం అమలు
● ఆదర్శంగా నిలుస్తోన్న పలు గ్రామాలు
12 ఏళ్లుగా మద్యపాన నిషేధం
అమలుచేస్తున్న సురాయిపల్లి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పలుగ్రామాల్లో గ్రామ పెద్దలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించొద్దని తీర్మానించారు. సురాయిపల్లి గ్రామస్తులు గత 12 ఏళ్లుగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం శెట్పల్లిసంగారెడ్డి, మెంగారం గ్రామాలు మద్యం విక్రయాలు నిలిపివేశాయి. ఈఏడాది కొత్తగా సజ్జన్‌పల్లి, పోతాయిపల్లి, కేశాయిపేట, అన్నారెడ్డిపల్లి, పర్మళ్ల గ్రామాలు సైతం స్వచ్ఛందంగా మద్య నిషేధం అమలు చేస్తున్నాయి. బెల్టు షాపులు, కిరాణం దుకాణాల్లో మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆంక్షలు విధించారు. ఈనిబంధనలు అతిక్రమిస్తే రూ. 50,000 నుంచి రూ.లక్షవరకు జరిమానా విధించాలని తీర్మానించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా ఎక్కడా మద్యపాన నిషేధం అమలు కావడం లేదు. గ్రామ పెద్దలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల చొరవతో జిల్లాలోని కొన్ని గ్రామాల్లో మద్యపాన నిషేధం అమలవుతుంది.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగ్రామాలపై ప్రత్యేక కథనం.
రాజంపేట: మండలంలోని కొండాపూర్, గుండారం జీపీ పరిధిల్లోని బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ 2025 జూన్‌లో ఇరు గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మితే వారికి రూ. లక్ష జరిమానాతో పాటు 7 చెప్పుదెబ్బలని తీర్మానంలో పేర్కొన్నారు. గ్రామంలో మద్యం అమ్మిన వారి సమాచారం తెలిపితే రూ. 10 వేల పారితోషకం అందిస్తామని, అదే విధంగా సంబంధిత వ్యక్తి పేరు గోప్యంగా ఉంచుతామని తీర్మానంలో వివరించారు.
కొండాపూర్‌లో తీర్మాన పత్రాన్ని చూపుతున్న గ్రామస్తులు (ఫైల్)

ఊరంతా ఒక్కటై.. మద్య నిషేధానికి జై