
‘వరి ఉత్పత్తిలో మనమే టాప్’
బాన్సువాడ రూరల్: రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో బాన్సువాడ నియోజికవర్గమే మొదటి స్థానంలో ఉందని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుడ్మిలో రూ. 26 లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాంను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ జాకోర, జలాల్‌పూర్ ప్రాంతాలకు నిజాంసాగర్ కాల్వల ద్వారా నీటిని అందించేందుకు రూ. 300 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నామన్నారు. వ్యవసాయ గోదాంలతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకురుతుందన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, నాయకులు గంగారాం, మధుసూదన్‌రెడ్డి, నాందేవ్, గోపాల్‌రెడ్డి, పిట్ల శ్రీధర్, ఎజాజ్, అంజిరెడ్డి, గురువినయ్, సుధాకర్‌గౌడ్, ఖమ్రు, గోపాలకృష్ణ, వెంకట్‌రాములు తదితరులు పాల్గొన్నారు.