
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
బీబీపేట: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం ఆయన తుజాల్‌పూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. భారీ వర్షాలు, వరద ముప్పుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, నెలలు నిండిన గర్భిణులను డెలివరీ కోసం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు ముందుగానే చేయాలని ఆదేశించారు. అవసరమైన ఇతర మౌళిక సదుపాయాల గురించి తగిన ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌కు సూచించారు. అనంతరం జనగామ, మాందాపూర్ గ్రామాల మధ్యనున్న ఎడ్ల కట్ట వాగు లోలెవల్ బ్రిడ్జిని పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరదలు ముంచెత్తితే వాహనాల రాకపోకలను కట్టడి చేయాలని అధికారులకు సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుకిరణ్, వైద్యాధికారి శిరీష, ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్, తహసీల్దార్ గంగాసాగర్, ఎస్సై ప్రభాకర్ పాల్గొన్నారు.
పెద్ద చెరువు పరిశీలన
కామారెడ్డి క్రైం: కామారెడ్డి పెద్ద చెరువును కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం సాయంత్రం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం చెరువు నీటి మట్టం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోల గురించి తెలుసుకున్నారు. అలుగు పైనుంచి ప్రజలు వెళ్లకుండా బారికేడ్లను పెట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ మల్లేష్, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఈఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.