
గతేడాది నవంబర్ నుంచి బొమ్మన్‌దేవ్‌పల్లిలో..
నస్రుల్లాబాద్ : మండలంలోని బొమ్మన్‌దేవ్ పల్లి గ్రామంలో 2024 నవంబర్ నుంచి మద్యం నిషేధం అమలు చేస్తున్నారు. గ్రామంలో ఎవ్వరైనా మద్యం అమ్మితే జరిమానా విధించాలని గ్రామస్తులు తీర్మానించారు. యువతను మద్యం నుంచి దూరంగా ఉంచితే మద్యానికి బానిసగా మారకుండా ఉంటారని గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా విధించడంతో పాటు పట్టించిన వారికి రూ.25 వేల పారితోషికం అందిస్తూ పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
ఈఏడాదిఫిబ్రవరి నుంచి బండారెంజల్‌లో...
బిచ్కుంద(జుక్కల్) : మండలంలోని బండారెంజల్ గ్రామంలో 2025 ఫిబ్రవరి నుంచి మద్యపాన నిషేధం కొనసాగుతుంది.మద్యం మత్తులో వాహనాలు అదుపుతప్పి ప్రమాద బారినపడుతున్నారు. అందరి మద్దతుతో గ్రామంలోకి మద్యం తీసుకురావొద్దు, విక్రయించొద్దని తీర్మానం చేశారు. గత ఆరు నెలల నుంచి మద్యం నిషేధం కొనసాగుతుంది.
గతేడాదిసెప్టెంబర్ నుంచి ఆజామాబాద్‌లో..
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని ఆజామాబాద్‌లో 2024 సెప్టెంబర్ నుంచి గ్రామస్తులు మద్యం అమ్మకాలు నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ. 50 వేల జరిమానా విధిస్తామని గ్రామస్తులు తీర్మానం చేశారు. గ్రామస్తులు చేసిన తీర్మానానికి అందరు ఇప్పటి వరకు కట్టుబడి ఉన్నారు.

గతేడాది నవంబర్ నుంచి బొమ్మన్‌దేవ్‌పల్లిలో..