
పక్కాగా టీచర్ల హాజరు
సదాశివనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయు ల డుమ్మాలు, ఆలస్యానికి చెక్ పెడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానం)కు శ్రీకారం చుట్టింది. ఈవిధానం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు 1న ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఈఫేస్ రికగ్నేషన్ కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులు రావడం, చాలా చోట్ల ఉపాధ్యాయులు పని చేస్తున్నచోట నివాసం ఉండకుండా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తు పాఠశాలలకు సమయానికి చేరుకోక పోవడం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరస్పరం సహకరించుకుంటు విధులకు హాజరు కాకున్నా మరుసటి రోజు రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈవిధానాన్ని ప్రవేశ పెట్టింది. ప్రత్యేకంగా ఉపాధ్యాయుల హాజరుశాతంపై దృష్టి పెట్టింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించే విధంగా, హాజరును వారే నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేలా యాప్‌ను తీసుకొచ్చింది.
ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఇలా...
జిల్లా వ్యాప్తంగా 191 ఉన్నత పాఠశాలలు, 06 ఆదర్శ పాఠశాలలు, 698 ప్రాథమిక పాఠశాలలు, 124 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. బోధనేతర సిబ్బందికి కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉద్యోగుల సమ య పాలనకు కొత్తగా ప్రవేశపెట్టిన టీజీఎఫ్‌ఆర్‌ఎ స్ యాప్‌ను సంబంధిత ఉద్యోగి స్మార్ట్ ఫోన్‌లో డౌ న్‌లోడ్ చేస్తారు. మొదటగా ఉద్యోగి వివరాలతో రి జిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి. యాప్ ఇన్‌స్టాలేషన్ సమయంలోనే సంబంధిత కార్యాలయం, పాఠశా ల ఆవరణ లాంగిట్యూడ్, లాటిట్యూడ్‌లను టెక్నీషియన్ అప్‌లోడ్ చేస్తారు. ఒకసారి లాగిన్ అయిన తర్వాత యాప్‌ను నిరంతరంగా వినియోగించవచ్చు. ఉద్యోగి ఉదయం నిర్దేశిత సమయానికి కా ర్యాలయంలోకి వచ్చిన తరువాత యాప్‌ను ఓపెన్ చేసి క్లాక్ ఇన్ అనే అప్షన్‌పై నొక్కితే సదరు ఉద్యోగి వచ్చిన సమయం ఆన్‌లైన్‌లో సంబంధిత పర్యవేక్షణ అధికారికి చేరుతుంది. ఆఫీసులో పని సమ యం ముగిసిన తర్వాత క్లాక్‌ఔట్ అని ఆప్షన్‌పై టచ్ చేస్తే ఉద్యోగి కార్యాలయాన్ని విడిచి వెళ్లే సమయా న్ని, పని చేసిన గంటలను లెక్కించి తిరిగి సంబంధిత పర్యవేక్షణ అధికారికి ఆన్‌లైన్‌లో చేరుతుంది.
పాఠశాలల్లో ప్రారంభమైన
ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం
ఉపాధ్యాయుల డుమ్మాలు,
ఆలస్యానికి చెక్
ఉత్తమ బోధనే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల
బలోపేతానికి కృషి
ఉద్యోగులు సమయపాలన పాటిస్తారు
ఈ విధానం మొదటగా విద్యార్థులకు అమలు చేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కూడా ప్రవేశ పెట్టడంతో సమయపాలన పాటిస్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, కార్యాలయాల్లో ఈవిధానాన్ని వర్తింప జేయాలి. బోధన, బోధనేతర సిబ్బందికి కూడా ఈ విధానం అమలు చేయడం మంచి నిర్ణయం. – చింతల లింగం,
టీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు,కామారెడ్డి
ఉత్తమ ఫలితాలు వస్తాయి
ఫేస్ రికగ్నైజేషన్ విధానంతో ఉత్తమ ఫలితాలు వస్తాయి. ప్రధానంగా ఈవిధానంలో సాంకేతిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపాధ్యాయుల డుమ్మాలు, ఆలస్యానికి చెక్ పెట్టినట్లు అవుతోంది. ఎంఈవో తనిఖీలు ఎక్కువగా ఉండవు. ఈ విధానం బాగుంది.
– గాధారి రాజిరెడ్డి, పీఆర్‌టీయూ
మండలాధ్యక్షుడు,సదాశివనగర్

పక్కాగా టీచర్ల హాజరు

పక్కాగా టీచర్ల హాజరు