
క్రైం కార్నర్
మట్టిలో కూరుకుపోయి కూలీ మృతి
బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44 విస్తరణ పనుల్లో బిహార్‌కు చెందిన సురాజ్ నిశాద్(40) అనే కూలీ మట్టిలో కూరుకుపోయి మృతి చెందాడు. ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన కొంతమంది కూలీలు ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్నారు. మంగళవారం ముప్కాల్ మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణలో పని చేసేందుకు సునీల్, సురాజ్, ధీరేంద్రయాదవ్, రాజు వచ్చారు. పనిలో భాగంగా పైపులను పక్కకు జరిపేందుకు సురాజ్, ధీరేంద్రయాదవ్‌లు గుంతలోకి దిగారు. ప్రమాదవశాత్తు పైపులైన్ పక్కన ఉన్న మట్టి పెల్లాలు కూలి సురాజ్ పూర్తిగా కూరుకుపోగా, ధీరేంద్రయాదవ్ ఛాతి వరకు మట్టి పడింది. ఇద్దరినీ హైవే అంబులెన్స్‌లో ఆర్మూర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే సురాజ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, ధీరేంద్రయాదవ్ చికిత్స పొందుతున్నాడు.

క్రైం కార్నర్