
ప్రజలకు అందుబాటులో ఉండాలి
మాచారెడ్డి/పాల్వంచ : ప్రభుత్వ శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశించారు. బుధవారం మాచారెడ్డి, పాల్వంచ మండలాల అధికారులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన విజన్ అవినీతిరహిత పాలన అని, దానికి అనుగుణంగా అధికారులు మసలుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తే అధికారులకు రక్షకుడిగా ఉంటానన్నారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా ఊరుకోనని హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న తరుణంలో పంచాయతీ కార్యదర్శులు పారిశుద్య పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చేయించాలన్నారు. అలాగే వైద్య అధికారులు, సిబ్బంది సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను అనర్హులు కాకుండా అర్హులకే కేటాయించాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశాల్లో తహసీల్దార్లు సరళ, హిమబిందు, ఎంపీడీవోలు గోపిబాబు, శ్రీనివాస్, ఎస్‌ఐ అనిల్, వైద్యాధికారి ఆదర్శ్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి
రామారెడ్డి: మండలంలోని మద్దికుంట, రెడ్డిపేట గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో చదువు ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు, స్టాఫ్ రూంను పరిశీలించారు సమస్యలుంటే తన దృష్టికి తేవాలని విద్యార్థులకు సూచించారు.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
పాల్వంచ, మాచారెడ్డి
మండలాల అఽధికారులతో సమీక్ష