
డ్రంకెన్ డ్రైవ్‌లో ఒకరికి రెండు రోజుల జైలు
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో కామారెడ్డి కోర్టు కృష్ణ అనే వ్యక్తికి బుధవారం రెండ్రోజుల జైలుశిక్ష విధించింది. రెండు రోజుల క్రితం పట్టణ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా కృష్ణ డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. కోర్టులో హాజరుపర్చగా ద్వితీయశ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ రెండు రోజుల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధించినట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు.
తాడ్వాయిలో ఒకరికి..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన మండలంలోని ఎర్రాపహాడ్‌కు చెందిన రాజాగౌడ్‌కు కామారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ రెండ్రోజుల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధించినట్లు ఎస్సై మురళి తెలిపారు.
ముప్కాల్ పరిధిలో ఇద్దరికి..
బాల్కొండ: ముప్కాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నిర్మల్ జిల్లా జాఫ్రాపూర్‌కు చెందిన దర్శనం రాజేశ్వర్, తాండ్రాకు చెందిన బదావత్ సాయికిరణ్‌లకు ఆర్మూర్ ద్వితీయ శ్రేణి మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ రెండ్రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై రజనీకాంత్ తెలిపారు.
ఐదుగురికి జైలు..
15 మందికి జరిమానా
ఖలీల్‌వాడి: మద్యం తాగి వాహనాలు నడిపిన ఐదుగురికి జైలు శిక్ష పడినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 20 మందికి నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. అనంతరం సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరచగా 15 మందికి రూ. 28వేలు జరిమానా విధించినట్లు తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని హస్గుల్ క్వారీ నుంచి మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సముందర్ తండా శివారులో పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అరుణ్ కుమార్ హెచ్చరించారు.