
విద్యా బలోపేతానికి కృషి
బిచ్కుంద(జుక్కల్): రాష్ట్రంలో విద్యా బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తొందని, అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మంగళవారం బిచ్కుందలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల సందర్శించి రికార్డులు, కిచెన్, తరగతి గదులు పరిశీలించారు. విద్యార్థులు, ప్రిన్సిపాల్ సునీతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులకు గురుకుల పాఠశాలలు వరంగా మారాయన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలన్నారు. క్లోరినేషన్ చేసిన నీటిని అందించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత, నాయకులు నాగ్‌నాథ్ పటేల్, గంగాధర్, బొగడమీది సాయిలు, ఉపాధ్యాయులు ఉన్నారు.
అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
మద్నూర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్‌పేట్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, రిటైర్డ్ టీచర్ మొయిన్‌పటేల్ అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం జరిగిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల సందర్శించిన
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు