
ఎల్వోసీ అందజేత
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన విఠల్ రెడ్డి సతీమణి స్వరూప కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆపరేషన్ అవసరమగా, ఆర్థిక సహాయం కోసం కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన రూ.3 లక్షల విలువైన ఎల్వోసీని ఇప్పించినట్లు మాజీ సర్పంచ్ రవితేజ గౌడ్ తెలిపారు. విఠల్ రెడ్డి కుటుంబ సభ్యులు షబ్బీర్ అలీకి కృత/్ఞతలు తెలిపారు.
సీఎంను కలిసిన
గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి టౌన్: సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళవారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసందర్భంగా సీఎంను శాలువాతో చంద్రశేఖర్‌రెడ్డి సన్మానించారు.కామారెడ్డిలో పార్టీ పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారని తెలిపారు.

ఎల్వోసీ అందజేత