
రక్తదానానికి ముందుకు రావాలి
కామారెడ్డి క్రైం: రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిలుపునిచ్చారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల సహకారంతో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కళాశాల పూర్వ విద్యార్థి బాల్‌రాజ్ గౌడ్ జ్ఞాపకార్థం కళాశాల ఆడిటోరియంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేసిన విద్యార్థులు, అధ్యాపకులను కలెక్టర్ అభినందించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రక్తదానం విషయంలో రాష్ట్రంలోనే జిల్లా ముందుండాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న, కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమార్, రెడ్‌క్రాస్ ప్రతినిధులు రఘుకుమార్, దస్తీరాం, నరసింహం, రమేశ్‌రెడ్డి, అధ్యాపకులు శ్రీనివాస్‌రావు, సుధాకర్, బాల్‌రాజ్ గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.