
‘ఉమ్మడి జిల్లాలో రూ. 120 కోట్ల రుణాలిచ్చాం’
నాగిరెడ్డిపేట : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్ల రుణాలను అందించామని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు జనరల్ మేనేజర్ అనుపమ తెలిపారు. సుమారు 98 వేల మంది రైతులు పంట రుణాలు, దీర్ఘ కాలిక రుణాలు పొందారన్నారు. మంగళవారం ఆమె నాగిరెడ్డిపేట సహకార కేంద్ర బ్యాంకును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో కర్షక్‌మిత్ర ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 1,500 మంది రైతులకు రూ. 30 కోట్ల వరకు రుణాలు ఇచ్చామన్నారు. సుమారు రూ.480 కోట్ల వరకు గోల్డ్‌లోన్‌లు అందించామన్నారు. ఖాతాదారులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి కొత్త రుణాలను పొందాలని సూచించారు. ఆమె వెంట డీజీఎం సుమమాల, స్థానిక బ్యాంకు మేనేజర్ ఎల్లేశం ఉన్నారు.