
ఈవీఎంలపై ఆరోపణలు అర్థరహితం
కామారెడ్డి టౌన్: ప్రజాక్షేత్రంలో ఓటమి పాలవుతూ కాంగ్రెస్ నాయకులు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం అర్థరహితమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు, దేశ ప్రయోజనాలే ప్రధానంగా దేశ ప్రధాని మోదీ పని చేస్తున్నారన్నారు. వరుసగా మూడు పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకులు ఈవీఎంలను తప్పబట్టిడం సమంజసం కాదన్నారు. కర్ణాటక, తెలంగాణల్లోనూ ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించారని, ఆ ఎన్నికలలో గెలిచినప్పుడు ఎందుకు ఈవీఎంలపై ఆరోపణలు ఎందుకు చేయలేదని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. బీజేపీకి, మోదీకి ప్రజల్లో ఆదరణ పెరగడాన్ని జీర్ణించుకోలేకే రాహుల్‌గాంధీ, ఇండి కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఓటరు జాబితాపై అనుమానాలు ఉంటే ఈసీ అడిగినట్లుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు శ్రీకాంత్, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతలది తప్పుడు ప్రచారం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
నీలం చిన్నరాజులు