
రుణాలను సకాలంలో చెల్లించాలి
నాగిరెడ్డిపేట: మహిళా సంఘాల సభ్యులు సీ్త్రనిధి ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని జిల్లా సీ్త్రనిధి రీజినల్ మేనేజర్ కిరణ్‌కుమార్ సూచించారు. మంగళవారం గోపాల్‌పేట, బొల్లారం, చీనూర్, ధర్మారెడ్డి, జలాల్‌పూర్, తాండూర్ గ్రామాల్లో రుణ బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది సీ్త్రనిధి ద్వారా రూ. 95 కోట్లు రుణాలుగా అందించాలన్నది లక్ష్యమన్నారు. వాటిలో ఇప్పటివరకు 30 శాతం రుణాలను అందించాలమన్నారు. జిల్లావ్యాప్తంగా రూ. 20 కోట్ల సీ్త్రనిధి రుణాల బకాయిలు ఉన్నాయన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో రూ. 3 కోట్ల వరకు బకాయిలున్నాయని పేర్కొన్నారు. బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. ఆయన వెంట సీసీలు దత్తు, శ్రీనివాస్‌రెడ్డి, సుజాత, అకౌంటెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.