‘లక్‌పతి దీదీ’కి మూడు సంఘాల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

‘లక్‌పతి దీదీ’కి మూడు సంఘాల ఎంపిక

Aug 13 2025 5:14 AM | Updated on Aug 13 2025 5:14 AM

‘లక్‌పతి దీదీ’కి మూడు సంఘాల ఎంపిక

‘లక్‌పతి దీదీ’కి మూడు సంఘాల ఎంపిక

కామారెడ్డి క్రైం: గ్రామీణాభివృద్ధి శాఖ ద్వా రా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ‘లక్‌పతి దీదీ’ అనే కేటగిరీకి మన జిల్లా నుంచి 3 స్వయం సహాయక సంఘాలు ఎంపికయ్యాయని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 5 సంఘాలను ఎంపిక చేయగా వాటిలో 3 సంఘాలు మన జిల్లాకు చెందినవేనని పేర్కొన్నారు. ఎంపికై న లింగంపేట, కామారెడ్డి మండల సమాఖ్యల అధ్యక్షులు గడ్డం సులోచన, గరిగె గోదావరి, బీర్కూర్‌ మండలం నుంచి బొందుగుల సవిత ఈనెల 15 న ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారని తెలిపారు. వారు కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికై న వారిని కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో సురేందర్‌, అదనపు డీఆర్‌డీవో విజయలక్ష్మి, డీపీఎం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement