
ప్రభుత్వ ఆస్తుల వివరాలు ఇవ్వాలి
కామారెడ్డి క్రైం: రూప్ టాప్ సోలార్ విద్యుత్ ప్యానెల్‌లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఇతర అన్ని ప్రభుత్వ ఆస్తుల వివరాలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో విద్యుత్, రెడ్కో శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలపై రూప్ టాప్ సోలార్ విద్యుత్ సిస్టం ద్వారా విద్యుత్ ఉత్పాదనకు చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ భవనాలను, ఆస్తులను సందర్శించి ఆయా సంస్థల భవనాలపై ఎండపడే ప్రాంతాల కొలతలు తీసుకుని, వివరాలను తొందరగా ఇవ్వాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈని ఆదేశించారు.
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్