
ఓట్ల దొంగతనం ప్రజాస్వామ్యానికి అవమానం
కామారెడ్డి క్రైం: దేశంలో ఎన్నికల కమిషన్ ఓట్ల దొంగతనం చేయడం ప్రజాస్వామ్యానికి అవమా నమని డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కా ర్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 7న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేసి దేశంలో ఓట్ల దొంగత నం ఎలా జరిగిందో ఆధారాలతో సహా కళ్లకు క ట్టినట్టుగా చూపించారన్నారు. ఇప్పటికై నా ఎ న్నికల కమిషన్ కళ్లు తెరిచి ఓటరు జాబితాను స రిదిద్ది, ప్రజాస్వామ్యానికి క్షమాపణ చెప్పాలని డి మాండ్ చేశారు. లేదంటే నిరసన కార్యక్రమాలు చేపట్టి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించా రు. నాయకులు పండ్ల రాజు, గోనె శ్రీనివాస్, గు డుగుల శ్రీనివాస్, పాత శివ కృష్ణమూర్తి, రాజాగౌడ్, ఐరేని సందీప్, పంపరీ లక్ష్మణ్, లక్ష్మీరాజ్యం, మసూద్, రాంకుమార్ గౌడ్, సర్వర్, జమీల్, సిద్దిక్, సిరాజ్, భాస్కర్, దోమకొండ శ్రీనివాస్, లక్కపత్ని గంగాధర్, కిరణ్, కస్తూరి నరహరి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అభినందన
కామారెడ్డి క్రైం: దేవునిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో సోమవారం నిర్వహించిన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులు ఒకే నిమిషంలో దేశఽంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్పడం లాంటి పలు నైపుణ్యాలను ప్రదర్శించారు. కలెక్టర్ వారిని అభినందించి, నోటు పుస్తకాలు, పెన్నులు, బహుమతిగా అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు.
ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం
బాన్సువాడ: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. సదరు విద్యార్థినులు ఉదయం నుంచి కనిపించకపోవడంతో వార్డెన్ మమత సోమవారం బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఎస్టీ కళాశాల హాస్టల్‌లో ఉండే ఇద్దరు విద్యార్థిను లు సోమవారం ఉదయం మరో విద్యార్థినితో కలిసి కాలేజీకి వెళ్లారు. తర్వాత వారు కనిపించక పోవడంతో వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వారి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోందని సీఐ అశోక్ తెలిపారు.