పేదల చదువులకు ‘విద్యాలక్ష్మి’ | - | Sakshi
Sakshi News home page

పేదల చదువులకు ‘విద్యాలక్ష్మి’

Aug 12 2025 7:39 AM | Updated on Aug 12 2025 12:45 PM

పేదల చదువులకు ‘విద్యాలక్ష్మి’

పేదల చదువులకు ‘విద్యాలక్ష్మి’

పేదల చదువులకు ‘విద్యాలక్ష్మి’

వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి విద్యాలక్ష్మి’ పథకం అమలు చేస్తోంది.

● ఇంజినీరింగ్‌, వైద్య ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ చదివే విద్యార్థులకు తోడు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.

● పేదల చదువుకు హామీ పత్రాలు అవసరం లేకుండానే తక్కువ వడ్డీతో బ్యాంక్‌ రుణం పొందే అవకాశం కల్పిస్తోంది.

● గూగుల్‌లో https://pmvidyalaxmi.co.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేరు, ఫోన్‌ నంబర్‌, ఈ–మెయిల్‌ ఐడీ, చిరునామా నమోదు చేసుకోవాలి.

● రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక సాధారణ విద్యారుణ దరఖాస్తు పత్రం(సీఈఎల్‌ఏఎఫ్‌) పూర్తి చేయాలి.

● పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ మార్కుల జాబితాతోపాటు ఆదాయ ధ్రువీకరణపత్రాలు అప్‌లోడ్‌ చేయాలి.

● అర్హులైన పేదలకు మూడు విభాగాల్లో రుణం మంజూరు అవుతుంది.

● మొదటి విభాగంలో రూ.4లక్షల లోపు, రెండో విభాగంలో రూ.4లక్షల నుంచి 7.5 లక్షలు, మూడో విభాగంలో రూ.7.5 లక్షల కంటే ఎక్కువ రుణం అందిస్తారు.

● దరఖాస్తు చేసుకునే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.4లక్షల లోపు ఉండాలి.

– సదాశివనగర్‌ (ఎల్లారెడ్డి)

మీకు తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement