
అలుగు పారుతున్న పెద్ద చెరువు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పెద్ద చెరువు ఆదివారం సాయంత్రం నుంచి స్వల్పంగా అలుగు పారడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాడ్వాయి మండలంలో కురిసిన భారీ వానలకు అక్కడి కుంటలు, చెరువులు నిండి, పెద్దచెరువుకు వరద వచ్చింది. దీంతో కామారెడ్డి చెరువు నిండి అలుగు పారడంతో కింద భాగంలోని మత్తడిలోకి నీరుచేరుతుంది. ఇకపై ఏ కొద్ది వర్షం కురిసినా అలుగుపారి వృథా నీరు ఉగ్రవాయి, ఆరేపల్లి, భవానీపేట, పాల్వంచ వాగు ద్వారా ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతుంది. ఈ వాగునీటి ద్వారా ఆయా గ్రామాల పరిధిలో ఇరువైపులా మోటారు పంపులు బిగించి వందల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. వానలను బట్టి దాదాపు రెండు నెలలు అలుగు పారే అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.