
నులి పురుగుల మాత్రలు వేసుకోవాలి
కామారెడ్డి క్రైం: నులి పురుగుల నివారణ కోసం ఏడాదినుంచి 19 ఏళ్లలోపు ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్రలు వేశారు. నులి పురుగుల నివారణ మాత్రలు వేసుకోని వారికి ఈనెల 18 న వేయించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీఈవో రాజు, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుకిరణ్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి విద్య తదితరులు పాల్గొన్నారు.