
కొత్త టెండర్ విధానాన్ని మార్చాలి..
గురుకుల పాఠశాలలకు నిత్యవసర వస్తువులు సరఫరా కోసం తెచ్చిన కొత్త టెండర్ విధానాన్ని మార్చాలని కాంట్రాక్టర్లు కోరారు. ఈమేరకు వారు సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఇటీవల జరిగిన 2025–26 ఏడాదికి గాను నూతన టెండర్ విధానంలో ప్రభుత్వం అనేక నిబంధనలను కొత్తగా తీసుకువచ్చిందన్నారు. వాటి ప్రకారం వస్తువులు సరఫరా చేస్తే తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. కొత్త టెండర్ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే 4 నెలల పెండింగ్ బిలుల్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. లేదంటే ఈ నెల 13 నుంచి సప్లయ్ నిలిపివేస్తామన్నారు.