
‘ఏఐపై అవగాహన పెంచుకోవాలి’
రామారెడ్డి: భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దేనని, దానిపై విద్యార్థులు ఇప్పటినుంచే అవగాహన పెంచుకోవాలని డీఈవో రాజు సూచించారు. రామారెడ్డి ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఆయన ఏఐ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఏఐపై విద్యార్థులకు అవగాహన కల్పించామని ఎంఈవో ఆనంద్‌రావు డీఈవోతో పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం ఆనంద్, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం గోపాల్‌రావు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.
దాడికి పాల్పడిన
ముగ్గురిపై కేసు నమోదు
మోపాల్: వ్యవసాయ భూమి దున్నడంతోపాటు ఆపాలని చెప్పినందుకు దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. మంచిప్ప గ్రామశివారు లో అమ్ముల శ్రావణ్ వ్యవసాయ భూమికి కొద్ది దూరంలో తలారి సాయన్న భూమి ఉంది. గత నెల 21న తన భూమిలో ట్రాక్టర్‌తో దున్నుతున్న తలారి సాయన్నను ఆపాలని శ్రావణ్ కోరాడు. దున్నడం ఆపకపోగా సాయన్నతోపాటు ఆయన కుమారుడు నిఖిల్, అల్లుడు మనోహర్ కలిసి శ్రావణ్‌పై పిడిగుద్దులతో దాడి చేశారు. నిఖిల్ రాడ్‌తో తలపై కొట్టాడు. గాయాలపాలైన శ్రావణ్ 15రోజులకుపైగా ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అంతేగాకుండా తలారి సాయన్న కుటుంబీకులు శోభ, లక్ష్మి కలిసి శ్రావణ్ తల్లిని విపరీతంగా కొట్టారు. సోమవారం శ్రావణ్ ఫిర్యాదు మేరకు సాయన్న, నిఖిల్, మనోహర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

‘ఏఐపై అవగాహన పెంచుకోవాలి’

‘ఏఐపై అవగాహన పెంచుకోవాలి’

‘ఏఐపై అవగాహన పెంచుకోవాలి’