
నిజాంసాగర్‌లోకి 5,393 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజాంసాగర్: ఎగువన మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం 5,393 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఏఈ అక్షయ్ తెలిపారు. ఘణపురం ఆనకట్ట పొంగి పొర్లుతుండడంతో 2,917 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోందన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు 600 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1,391.5(4.723 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.
‘కల్యాణి’లోకి 250 క్యూసెక్కులు..
ఎల్లారెడ్డిరూరల్: తిమ్మారెడ్డి గ్రామ శివారులోని కల్యాణి ప్రాజెకులోకి ఆదివారం 250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 అడుగులు కాగా.. 408.50 అడుగుల నీటిని నిలువ ఉంచుతున్నారు. ఇన్‌ఫ్లో నీటిలో 179 క్యూసెక్కులను నిజాంసాగర్ మెయిన్ కెనాల్‌కు మళ్లిస్తుండగా.. 71 క్యూసెక్కులను ఒక వరద గేటు ఎత్తి మంజీర నదిలోకి వదులుతున్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న ఎడ్లకట్ట వాగు
బీబీపేట: ఎగువన కురుస్తున్న వర్షాలతో జనగామ – మాందాపూర్ గ్రామాల మధ్యనున్న ఎడ్లకట్ట వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాగులో నుంచి ఎవరూ దాటే ప్రయత్నం చేయకుండా బందోబస్తు నిర్వహించారు. బీబీపేట పెద్ద చెరువుకు ప్రధానంగా ఎడ్లకట్ట వాగే ఆధారం. ఈ వాగు ప్రవహిస్తుండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు.
చెరువుల్లోకి నీరు..
తాడ్వాయి: మండలంలో నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, కుంటలు నిండుకుండలా మారుతున్నాయి. కృష్ణాజీవాడి చెరువు అలుగు పారుతోంది. మండలంలో మక్క, పత్తి, సోయా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ఈ పంటలు ఏపుగా పెరిగాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

నిజాంసాగర్‌లోకి 5,393 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నిజాంసాగర్‌లోకి 5,393 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో